Wednesday, February 1, 2023

నేడు నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడునల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆ జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు. జిల్లాలోని దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంటు నిర్మాణపనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి దామరచర్ల పర్యటనకు బయల్దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. అనంతరం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను పరిశీలిస్తారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement