Thursday, September 21, 2023

అసెంబ్లీకి సీఎం కేసీఆర్.. ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రసంగం

సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కానున్నారు. ఉయభసభల్లో ప్రభుత్వం ద్ర‌వ్య వినిమ‌య బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో శాస‌న‌స‌భ‌, మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి, నేరుగా ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. ఈ బిల్లుపై చ‌ర్చ అనంత‌రం సీఎం కేసీఆర్ స‌మాధానం ఇవ్వ‌నున్నారు. ద్రవ్య విని‌మయ బిల్లు ఆమోదం అనం‌తరం శాస‌న‌సభ సమా‌వే‌శాలు నిర‌వ‌ధి‌కంగా వాయిదా పడే అవ‌కా‌శం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement