Thursday, April 25, 2024

తెలంగాణలో లాక్ డౌన్ ఎందుకు వద్దంటే..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా విరుచుకు పడుతున్న వేళలో దేశవ్యాప్త లాక్ డౌన్ పై డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం లేదని చెబుతోంది. ఆయా రాష్ట్రాలు స్థానికంగా తమకున్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకుని అక్కడికక్కడ లాక్ డౌన్ విధించాలని చెబుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్​ డౌన్​ లు అమలు చేసేందుకే రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్​ లాక్​డౌన్​ అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ సహా మరొకొన్ని కర్ఫ్యూ లాంటివి విధిస్తున్నాయి. రాజస్థాన్, కేరళలోనూ పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు కానుంది. అయితే, తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు, పదుల సంఖ్య మరణాలు సంభవిస్తున్నాయి. ఒక దశలో కరోనా కేసుల సంఖ్య పదే వేల మార్క్ ను కూడా దాటింది.  కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. బెడ్స్, ఆక్సిజన్, మందులు దొరకని పరిస్థితి నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం సాధ్యం కాదని ప్రభుత్వం మాట.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎందుకు విధించకూడదనే విషయంలో సీఎం కేసీఆర్‌ లోతైన విశ్లేషణ చేశారు. లాక్‌ డౌన్‌ వల్ల ఉపయోగంలేదని అన్నారు. తెలంగాణ.. ఇండియాలో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ స్టేట్‌, కనుక ఇక్కడ 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. కరోనా మెదటి వేవ్‌ సమయంలో లాక్‌ డౌన్‌ విధిస్తే వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని చూశాం. వీరంతా వెళ్లిపోతే తిరిగి రావడం కష్టం. అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం పుషలంగా పండింది. తెలంగాణవ్యాప్తంగా గ్రామాల్లో 6,144 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిండి ఉన్నది. ప్రస్తుతం అకడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు అంటే ఆషామాషీ కాదు. దీనిలో కిందినుంచి మీది దాక చైన్‌ సిస్టం ఇమిడి ఉంటది. ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాళ్లు, మిల్లులకు తరలించే కూలీలు, లారీలు, ట్రాన్స్‌పోర్ట్ట్‌ వెహికిల్స్‌ మిల్లులకు చేరవేయడం, అకడ దించడం, మళ్లీ అకడినుంచి ఎఫ్‌సీఐ(FCI) గోడౌన్లకు తరలించడం, మళ్లీ అకడ దించడం, స్టాక్‌ చేయడం, తిరిగి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం.. ఇంత వ్యవహారం ఉంటది. ఈ మెత్తం వ్యవహారంలో లక్షలమంది భాగస్వాములవుతారు.

‘వివిధ రాష్ట్రాలనుంచి వచ్చి రైస్‌మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? లాక్‌డౌన్‌ విధిస్తే ఇంతమంది ఎకడపోతారు? కార్మికులు చెల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా? కొనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎకడ పెట్టుకుంటాడు? మెత్తం ధాన్యం కొనుగోలు వ్యవస్థ ఎకడికకడ స్తంభించిపోయే ప్రమాదమున్నది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా ఉండే ప్రమాదం ఉన్నది. అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, పండ్లు, ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసులు, ప్రసవాలు, పారిశుద్ధ్యం వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేం. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, ఆక్సిజన్‌తోపాటు ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నం. ఒకవేళ లాక్‌డౌన్‌ విధిస్తే వీటన్నిటికీ ఆటంకం ఏర్పడుతది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు, కాబట్టి లాక్‌డౌన్‌ విధించలేం’ అని సీఎం వివరించారు.

తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యలో ప్రజలు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement