Thursday, September 16, 2021

షెకావత్ తో నీటి అంశాలపై కెసిఆర్ చర్చ

ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఏపీతో జల వివాదాలపై చర్చించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై తెలంగాణ అభ్యంతరాలను షెకావత్ కు వివరించారు. కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై తమ వాదనలను వినిపించారు.

అంతకుముందు..కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని సీఎం కేసీఆర్ క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గ‌డ్క‌రీకి సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే వ‌ర‌ద‌ల వ‌ల్ల దెబ్బ‌తిన్న రోడ్ల‌కు నిధులు కోరడంతోపాటు నూత‌న జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం, ఇప్ప‌టికే మంజూరైన హైవేల‌కు త్వ‌ర‌గా నెంబ‌ర్లు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హైవేల నిర్మాణ ప‌నుల్లో వేగం పెంచాల‌ని, నిర్వ‌హ‌ణ‌కు నిధులు కేటాయించాల‌ని గ‌డ్క‌రీని సీఎం కేసీఆర్ కోరారు

కాగా, గత 6 రోజులుగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా గడిపారు. కేంద్రం పెద్దలను కలుస్తూ పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిశారు. మంగళవారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News