Thursday, March 28, 2024

దళితబంధుకు నా భార్య ఆశీర్వాదం.. అవి ఆగవు: సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రారంభించిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు వచ్చినా రేషన్‌, పెన్షన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ లో శ్రీకారం చుట్టారు. జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు. 15 మంది లబ్ధిదారులకు సీఎం స్వయంగా అందించారు.

ఈ సందర్భంగా సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు. దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చేందుకే ఈ పథాకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కోసం రూ. 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. రానున్న 15 రోజుల్లో మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేస్తామని సీఎం తెలిపారు.  

స్కీం పెట్టేముందు తన ఇంట్లో జరిగిన సంబాషణను కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి వెళ్తున్న సమయంలో ఉద్యమానికి వెళ్లాలా? వద్దా ? అని తన భార్యని అడగగా, పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించేది ఏమీ లేదు. న్యాయం ఉంది కొట్లాడని చెప్పింది. అలాగే దళితబంధు గురించి అడిగితే దళితుల పరిస్థితి అన్యాయంగా ఉంది. నువ్వు మొండిపడతావు కదా అని అమె ఆశీర్వదించి చేయమని చెప్పిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక కరీంనగర్ జిల్లాలోనే రైతుభీమాకి శ్రీకారం చుట్టామని, ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. తన జీవితంలో ఏది చేప‌ట్టిన వెనుక‌కు పోలేదన్నారు. యావ‌త్ తెలంగాణ హ‌ర్షించే విధంగా భార‌త‌దేశ‌మే ఆశ్చ‌ర్య‌ప‌డే విధంగా మ‌నం ముందుకు పోవాలన్నారు. ఈ స్కీం అమ‌లులో జిల్లా క‌లెక్ట‌ర్లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తారని సీఎం వివరించారు. చివరగా జై దళితబంధు.. జై భీమ్.. జై హింద్.. జై తెలంగాణ అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement