Saturday, October 12, 2024

TS | అమరజ్యోతిని పరిశీలించిన సీఎం కేసీఆర్​.. జూన్​ 22న ఆవిష్కరణకు ఏర్పాట్లు

హైదరాబాద్​లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అమరజ్యోతిని సీఎం కేసీఆర్​ ఇవ్వాల (సోమవారం) సాయంత్రం పరిశీలించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో వారికి గుర్తుగా ఈ స్మారక స్తూపాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కాబోతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 2 నుంచి 22వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. జూన్‌ 22న ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమం జరుగనున్నది.

తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించనున్నారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. అదే రోజు ట్యాంక్ బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ అదే రోజున ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ స్తూపాన్ని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement