Wednesday, March 29, 2023

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

- Advertisement -
   

ముందుగా హెలికాప్టర్‌ ద్వారా మహబూబాబాద్‌ నుంచి కొత్తగూడెంకు వచ్చిన సీఎం కేసీఆర్ కు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకోగా.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లో కలెక్టర్‌ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement