Tuesday, April 16, 2024

‘రెడ్డి’కే హుజురాబాద్ టికెట్.. మరి ఎస్సీల మాటేంటి?

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీరుగుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వేసే ఎత్తులు, లెక్కలు అంతు పట్టడం లేదు. హుజురాబాద్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేశారు ? అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వినిపించినా.. కేసీఆర్ ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. నియోజకవర్గంలో పట్టున్న నేత కోసం ఆయన అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే, కేసీఆర్ మనసులో ఉన్నది ఏంటి? అన్నది అంతుచిక్కడం లేదు. ఇటీవల పార్టీలో చేరిన హుజురాబాద్ నేత కౌశిక్ రెడ్డికి టికెట్ ఖరారు అయిందనే టాక్ ఆయన వర్గం నుంచి వినిపిస్తోంది.

ఒకవేళ కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తే మరి దళితుల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ దళిత బంధు పథకానికి శ్రీకారం చూట్టనున్నారు. దీంతో అక్కడి నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అభ్యర్థిగా బరిలోదింపుతారనే ప్రచారం జరిగింది. అయితే, కేసీఆర్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టినట్లు విశ్వనీయ సమాచారం.

హుజురాబాద్ లో బీసీ ఓట్లు 1.02 లక్షలు ఉండగా.. ఓసీ ఓటర్లు 40 వేలు, ఎస్సీ ఓటర్లు 52 వేల మంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ‘రెడ్డి’ సామాజిక వర్గం దూరంగా ఉంది. రెడ్డిలకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఈ సారి కూడా హుజురాబాద్ లో ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా బరిలో దింపే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ కౌశిక్ రెడ్డికి టికెట్ ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దళిత బంధు పథకంతో ఎస్సీలను ఆకర్షించడం ద్వారా ఆవర్గం ఓట్లు కూడా టీఆర్ఎస్ ఉంటాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతోఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్నట్లు రెడ్డి ఓట్లు,ఎస్సీ ఓట్లు గంపగుత్తుగా కారుకే పడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ లో కేసీఆర్ కు ఆ 412 ఓట్లు ఖాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement