Friday, March 29, 2024

సీఎం జ‌గ‌న్ కి సోమువీర్రాజు బహిరంగ లేఖ .. ఏం రాశారంటే ..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బ‌హిరంగ లేక రాశారు.. నవ మాసాలు నిండినా మీ ప్రోత్సాహకం అందలేదు … మీరు ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు అందరూ ఏకమై ప్రోత్సాహకాలు కోసం ఏకగ్రీవం చేసి గ్రామసర్పంచ్ లను ఎన్నుకుని తొమ్మిది మాసాలు దాటినా ప్రోత్సాహకం అందలేదన్న విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా సీఎం జ‌గ‌న్ కి గుర్తుచేస్తున్నాని అన్నారు. రాష్ట్రంలోని 13,371 పంచాయితీలకు పలు పంచాయితీలను.. నగర పంచాయితీలుగా మార్చడంతో పాటు ఇతర సమస్యలు కారణంగా 13,097 గ్రామపంచాయితీలకు ఫిబ్రవరినెల‌లో నాలుగుదశల్లో గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ జనవరి 26 వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేశారు. ఒక కాపీని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ కు.. అదేవిధంగా పంచాయితీరాజ్ శాఖకు పంపారు.

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం రెండు వేల జనభా ఉన్న గ్రామపంచాయితీ ఏకగ్రీవం అయితే అయిదు లక్షలు ప్రోత్సాహకం, 2 వేలకు పైబడి 5 వేల వరకు జనభా కలిగిన గ్రామ పంచాయితీకి 10 లక్షలు, 5 వేల నుండి 10 వేల వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయితీకి 15 లక్షలు, 10 వేలు పైబడిన గ్రామ పంచాయితీకి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 20 లక్షలు ప్రోత్సాహకం ఇస్తామని,.ఉత్తర్వులలో మీ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇదే నిజమని నమ్మిన గ్రామ పంచాయితీలలో ప్రజలు మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సిద్దిస్తుందని, గ్రామ పంచాయితీలు ఆర్ధిక పరిపుష్టం అవుతాయని 2,199 గ్రామ పంచాయితీలు ఏక గ్రీవం చేసుకుంటే కనీసం నయాపైసా ప్రోత్సాహకం అందించలేదు. సీఎం జ‌గ‌న్ మాటతప్పను, మడమ తిప్పను అనే పదాన్ని తరచుగా ఉచ్చరిస్తారు,.అదే క్రమంలో, మీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రోత్సహకాల ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఈ బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాన‌ని చెప్పారు. గ్రామాల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుందని,. ఐతే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గమనిస్తే చిత్తశుద్ధి కరువయ్యిందని స్పష్టంగా తెలుస్తుంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement