Monday, January 17, 2022

బంగారు పువ్వుల‌తో సీఎం జ‌గ‌న్ కి అభిషేకం

ఏపీ ఉద్యోగుల‌కు 23ఫిట్ మెంట్ ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా , ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌యో ప‌రిమితిని పెంచారు సీఎం జ‌గ‌న్. 60సంవ‌త్స‌రాలు ఉన్న రిటైర్మెంట్ వ‌య‌స్సుని 62సంవ‌త్సరాల‌కు పెంచారు ముఖ్య‌మంత్రి. జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఏపీ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కి పాలాభిషేకాలతో పాటు బంగారు పూల వర్షం కూడా కురిపిస్తున్నారు. శ్రీకాళ హస్తిలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్ర పటానికి బంగారు పూలతో అభిషేకం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యోగులకు ఏ సీఎం ఇవ్వని వరాలను ఇచ్చారని … బంగారు పూలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News