Wednesday, April 24, 2024

దళిత బంధుకు లక్ష కోట్లుః సీఎం కేసీఆర్

దళితబంధు పథకానికి దశలవారీగా 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాళ్లు, చేతులు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్​గా బండా శ్రీనివాస్​ను నియమించిన నేపథ్యంలో  సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్… దళితబంధు పథకం గురించి వివరించారు. హుజూరాబాద్​లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు పథకం… కేవలం తెలంగాణలోనే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ పథకం దేశ ఎస్సీలందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతోందని తెలిపారు. పట్టుదలతో తామందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండిః గురుకులాలకు నిధులు లేవు.. దళిత బంధుకు కోట్లా?: మాజీ ఐపీఎస్ విమర్శలు

Advertisement

తాజా వార్తలు

Advertisement