Friday, April 19, 2024

చింతామ‌ణి నాట‌కాన్ని ఎందుకు నిషేధించారు – ఏపీ స‌ర్కార్ పై హైకోర్టు ఆగ్ర‌హం

వందేళ్ళ నాటి చింతామ‌ణి నాటకాన్ని నిషేధించింది ఏపీ ప్ర‌భుత్వం. దాంతో ఏపీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు హైకోర్టు లో దాఖలైన పిటిషన్ వాదనలను న్యాయవాది ఉమేష్ చంద్ర వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ..నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది ధర్మాసనం. ఏపీ హైకోర్టు చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని ప్రశ్నించింది . చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని హై కోర్టుకు తెలిపారు న్యాయవాదులు..పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఏపీ ధర్మాసనం. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, ఇతర అధికారులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement