Tuesday, April 23, 2024

సమతామూర్తి విగ్రహంతో చినజీయరే బిజినెస్​ చేస్తున్నారు: సీతక్క ఫైర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సమ్మక్క- సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజీయర్‌ స్వామిపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. చిన్న జీయర్‌ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క – సారలమ్మ మీద ఎందుకు అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారంటూ బుధవారం ఆమె ఒక వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మా తల్లులది వ్యాపారమా..? మరి మీరు సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేస్తున్నది వ్యాపారం కాదా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్‌ లేదు.

కానీ మీరు పెట్టిన 120 కిలో బంగారం గల సమతామూర్తి విగ్రహం చుడటానికి రూ. 150 టికెట్‌ ధర పెట్టారు. దీంతో ఎవరిది వ్యాపారం..? మీది బిజినెస్‌ అనేది స్పష్టమవుతోంది. సమ్మక్క- సారలమ్మ తల్లుల దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు ‘ అని సీతక్క ఫైర్‌ అయ్యారు. లక్షల రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పేద వారి ఇంటికి వెళ్లారా..? అని ఆమె ప్రశ్నించారు. చిన్న జీయర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. రియల్‌ ఎస్టేట్‌ స్వామి అయిన చిన్న జీయర్‌ స్వామిగి తగిన బుద్ది చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement