Saturday, April 20, 2024

292 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌తో చైనా టాప్‌.. 160 కోట్లతో రెండో స్థానంలో భారత్‌

న్యూఢిల్లి : వ్యాక్సినేషన్‌లో చైనా అగ్ర స్థానంలో నిలిచింది. భారత్‌లో సుమారు 160 కోట్ల డోసుల పంపిణీ జరిగితే.. చైనాలో 292 కోట్ల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. సుమారు 292కోట్ల 89లక్షల 81వేల డోసులను చైనా దేశం అందజేసింది. ప్రతీ 100 మందిలో 207 మందికి వ్యాక్సినేషన్‌ అందించడం జరిగింది. ఒక డోసు తీసుకున్న వారు చైనాలో 89.50 శాతం మంది ఉండగా.. రెండు డోసులు తీసుకున్న వారు 86 శాతం ఉన్నారు. చైనా తరువాత వ్యాక్సినేషన్‌లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

భారత్‌ తరువాత 78 కోట్లతో యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మూడో స్థానంలో, 52 కోట్లతో అమెరికా నాల్గో స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో 29 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఇప్పటి వరకు 184 దేశాల్లో 9.67 బిలియన్‌ డోసుల వినియోగం జరిగింది. ప్రతీ రోజు 39.9 మిలియన్‌ల డోసులను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ జరుగుతున్నది. అమెరికాలో రోజుకు 1.29 మిలియన్‌ల డోసులు పంపిణీ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సగటు తీయగా.. ప్రతీ 100 మందిలో 123 షాట్స్‌ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. చైనా జనాభా వాటా 18 శాతం ఉంది. వ్యాక్సినేషన్‌ వాటా 30.3 శాతంగా ఉంది. భారత్‌ జనాభా వాటా 17.5 శాతం ఉండగా.. ప్రపంచం వాటా 16.5 శాతంగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement