Thursday, April 18, 2024

బీజింగ్ లో పురుగుల వ‌ర్షం.. ఫేక్ అంటోన్న జ‌ర్న‌లిస్ట్

చైనాలో పురుగుల వ‌ర్షం కురిసిందా అంటే ఈ వీడియో చూస్తే ఔన‌నే అనిపిస్తుంది. బీజింగ్ లోని రోడ్ల పక్కన పార్క్ చేసిన కార్లపై పురుగుల వంటి మురికి గోధుమ రంగు జీవుల సమూహాలు కనిపించాయి. ఆకాశం నుంచి పడే పురుగుల బారిన పడకుండా ప్రజలు గొడుగులు పట్టుకుని వెళ్లడం కూడా కనిపించింది. పురుగుల వర్షం వెనుక కారణం ఇంకా తెలియలేదు అయితే సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్వర్క్ ప్రకారం.. భారీ గాలులకు కొట్టుకుపోయిన తర్వాత బురద జీవులు ఇలా పడిపోయాయని అంటున్నారని అని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.పీరియాడికల్ ప్రకారం.. తుఫాను తర్వాత కీటకాలు వర్ల్పూల్లో చిక్కుకున్నప్పుడు ఈ రకమైన సంఘటన జరుగుతుందని కూడా పేర్కొంది.ఇది ఇలా ఉండ‌గా ఆ వీడియో ఫేక్ అని బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షపాతం లేదని చైనా మీడియా పేర్కొంది. నేను బీజింగ్ లో ఉన్నాను. ఇక్కడ పురుగుల వర్షం లేదు. ఈ వీడియో నకిలీది. ఈ రోజుల్లో బీజింగ్లో వర్షాలు పడలేదు అని షెన్ షివే అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో అసలైనదా కాదా అని నెటిజ‌న్లు అయోమ‌యంలో ప‌డ్డారు.

https://twitter.com/TheInsiderPaper/status/1634283529054965814
Advertisement

తాజా వార్తలు

Advertisement