Saturday, April 20, 2024

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు, పాంగాంగ్​ సరస్సుపై ఏకంగా బ్రిడ్డ్ నిర్మాణం.. ఇవిగో ఆధారాలు

లడఖ్ నుండి సిక్కిం వరకు విస్తరించి ఉన్న భారత్​ చైనా సరిహద్దు వెంబడి అనేక కీలక ప్రదేశాల్లో చైనా అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. వారి వాహనాలు, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ ను విస్తరిస్తున్నట్లు తాజాగా వెలువడ్డ ఉపగ్రహ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పాంగాంగ్​ సరస్సు వద్ద పెద్ద ఎత్తున వంతెన నిర్మాణం చేపట్టడం కూడా ఈ శాటిలైట్​ ఫొటోల్లో చూడొచ్చు. అయితే దీనిపై ఇప్పటివరకు భారత ప్రభుత్వం రియాక్ట్​ కాలేదు.

భారత సరిహద్దు ప్రాంతంలోని పాంగాంగ్​ సరస్సు వద్ద చైనా దురాక్రమణలు కొనసాగుతున్నాయా? పాంగాంగ్​ సరస్సుపై చైనా భారీ వంతెనలను నిర్మిస్తోందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాజా శాటిలైట్​ ఫొటోల్లో చైనా దురాక్రమణకు సంబంధించిన వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి ఆధారంగా భారత్​ చైనా సరిహద్దుల్లో చైనా భారత భూభాగంపై ఆక్రమ నిర్మాణాలు చేపడుతోందన్నది స్పష్టమవుతోంది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చైనా దురాక్రమణలు చేస్తున్నా భారత ప్రభుత్వం గమ్మునుండిపోతోంది కానీ, రాష్ట్రాల అధికారాలను ఎట్లా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలు చేస్తోందని విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలు, కేంద్ర ప్రభుత్వ స్పందించని తీరు ఇప్పుడు స్పష్టమవుతోందంటున్నారు పరిశీలకులు..

చైనా గత నెలలో పాంగాంగ్​ పాత వంతెనను పూర్తి చేసి.. ఇప్పుడు పాంగోంగ్ సరస్సు యొక్క ఉత్తర,  దక్షిణ భాగాలను కలుపుతూ కొత్త నిర్మాణాన్ని చేపట్టింది. ఇవన్నీ తాజాగా రిలీజ్​ అయిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే చైనా చేపట్టిన ఈ కొత్త నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. అదికూడా మునుపటి వంతెన కంటే బాగా విశాలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

పాతదానికి సమాంతరంగా నిర్మాణంలో ఉన్న పక్కనే జరుగుతున్న పనులు ఈ సంవత్సరం మార్చి చివరి నుండి ఏప్రిల్ ప్రారంభంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే  సరస్పు చి త్రాలు సరస్సు యొక్క ఉత్తర, దక్షిణ ఒడ్డున ఏకకాలంలో నిర్మాణాన్ని చూపించాయి. ఈ ప్రాంతంలో చైనా భూ బలగాల కార్యకలాపాలకు కొత్త నిర్మాణం యొక్క స్థానం వ్యూహాత్మకంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త రోడ్ల నెట్‌వర్క్ ద్వారా కొత్త వంతెనకు సపోర్ట్​ లభించే అవకాశం ఉంది.

తూర్పు లడఖ్ సమీపంలో చైనా నిర్మాణాన్ని భారత ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పేర్కొంది. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. 1962 నుండి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ అక్రమ ఆక్రమణను ఎన్నడూ అంగీకరించలేదు  అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్‌లో చెప్పారు.  

- Advertisement -

కాగా, ఇరు పక్షాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్ ,  చైనా అనేక రౌండ్ల సైనిక స్థాయి చర్చలతో పాటు దౌత్య సమావేశాలను నిర్వహించాయి. అయినప్పటికీ అనేక ప్రదేశాల్లో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో కొత్త నిర్మాణాన్ని ఆపడంలో ఈ చర్చలు విఫలమయ్యాయి. లడఖ్ నుండి సిక్కిం వరకు విస్తరించి ఉన్న సరిహద్దు వెంబడి అనేక కీలక ప్రదేశాలలో చైనా మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ ను విస్తరిస్తున్నట్లు అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ప్రకారం, మే 19న భారత్, చైనాతో సహా బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. .

ఆగస్ట్ 2020 లాంటి పరిస్థితిని నిరోధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల్లో చైనా వంతెన కీలక భాగమని నిపుణులు భావిస్తున్నారు. భారత సాయుధ దళాలు చైనీయుల నెమ్మదిగా ప్రతిస్పందనను ఉపయోగించుకున్నాయి మరియు కైలాష్ ఎత్తులపై కీలకమైన స్థానాలపై నియంత్రణ సాధించడానికి ఒక ఆశ్చర్యకరమైన ఆపరేషన్ నిర్వహించాయి. కొత్త వంతెన రూటోగ్ వద్ద ఆస్తులను శాశ్వత స్థానాలకు తరలించడానికి చైనీస్ దళాలు తీసుకునే సమయాన్ని తగ్గిస్తుంది. కొత్త సమాంతర నిర్మాణం యొక్క అదనపు వెడల్పు పాంగోంగ్ సరస్సు యొక్క ఒక చివర నుండి మరొక వైపుకు భారీ యంత్రాలు మరియు సైనిక వాహనాలను రవాణా చేసే సామర్థ్యాన్ని పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement