Wednesday, April 17, 2024

పోరలు మస్త్​ ఖరాబ్​ అయితుర్రు బై.. తల్లిదండ్రులను ఏమార్చి 4 లక్షలు ఊడ్చేశారు

కుత్భుల్లాపూర్ క్రైమ్ (ప్రభన్యూస్) : తల్లి తండ్రులను ఏమార్చి సొంత పిల్లలే ఇల్లు గుల్ల చేసిన ఘటన ఇది.. దాచిపెట్టిన డబ్బంతా జల్సాలకు ఖర్చుచేసిన సంఘటన జీడిమెట్ల పోలీష్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ ఆర్ నాయక్ నగర్ లో నివాసం ఉండే శివశంకర్ గుప్తా, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు రాకేష్(9), వెంకట సాయి(8) . శివశంకర్ ప్రైవేటు ఉద్యోగి, భార్య వరలక్ష్మి పక్క వీధిలో కిరాణా షాపు నడుపుతోంది. నెల క్రితం శివశంకర్ 4 లక్షల రూపాయలను పిల్లలు చూస్తుండగా తన ఇంట్లోని ఓ బ్యాగులో దాచిపెట్టాడు. స్కూల్ కు సెలవులు ఉండటంతో పిల్లలిద్దరు ఇంట్లోనే ఉండేవారు. రోజు భార్యాభర్తలు పనిమీద బైటకు వెళ్లగానే పిల్లలిద్దరు బ్యాగులో దాచిపెట్టిన డబ్బులను కొన్నికొన్ని తీసుకొని బేకరీలలో ఖర్చుపెట్టేవారు. వీరికి పక్కింట్లో ఉండే రాజ్ వర్ధన్ (15), రాకేష్ (15) 10వ తరగతి చదివే ఇద్దరు మైనర్లతో పరిచయం ఏర్పడింది. రాకేష్, వెంకట్ సాయి రోజు డబ్బులు ఇంట్లోనుండి తెచ్చి షాపులలో ఖర్చుపెటేది చూసిన రాజ్ వర్దన్, రాకేష్ ఎలాగైన వారి వద్ద డబ్బులు కాజేయాలని ప్లాన్​ చేశారు.

వారికి వాచీలు‌ ఆశ చూపి దానికి బదులుగా ఇంట్లో ఉన్న డబ్బులను అడిగి తీసుకునేవారు. అలాగే వీరందరూ రోజు ఈ డబ్బులతో బేకరీ ఐటమ్స్, వాచీలు, లైటర్స్, సెల్ ఫోన్ కొనుగోలు చేసేవారు. ఇలా మొత్తం 4 లక్షల రూపాయలు మొత్తం ఖర్చుపెట్టారు. ఈ నెల 9వ తేదీన శివశంకర్ ఇంట్లో దాచిపెట్టిన డబ్బుల కోసం బ్యాగులో చూడగా ఒక్క పైసా లేకపోయేసరికి పిల్లలను అడగగా వారు తామే డబ్బులు తీసామని పక్కింటి అన్నలతో కలిసి ఖర్చు చేసామని తెలిపారు. చేసేది లేక శివశంకర్ ఈ నెల 20 న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై సిఐ కె.బాలరాజు ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ సంఘటన జరిగింది వాస్తవమే అన్నారు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.. ఇంట్లో పిల్లల ఎదురుగా డబ్బులు దాచిపెట్టవద్దని, రోజు పిల్లలపై నిఘా పెట్టాలని, పిల్లలు సెల్ ఫోన్ లలో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ చెడుదారులు పడుతున్నారని తెలిపారు. డబ్బులు ఎత్తుకెళ్ళి షాపింగులు చేస్తున్నారని, ప్రతి తల్లిదండ్రులు పిల్లలను డబ్బులకు దూరంగా పెట్టాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement