Saturday, September 23, 2023

Adilabad: పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పిల్లల అక్రమ రవాణా ముఠాలోని 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలను రూ.2.5లక్షలకు తండ్రి అమ్మేశాడు. అయితే ఇద్దరు పిల్లలను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు. పిల్లలను కొనుగోలు చేసిన ఆరుగురు, సహకరించిన ఇద్దరు, తండ్రి గంగాధర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు చిన్నారులను పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement