Wednesday, April 24, 2024

చైనా నెంబర్ వన్..నాలుగో స్థానంలో భారత్

ప్రపంచ సైనిక వ్యవస్థలో మన దేశ రక్షణ రంగానికి నాలుగో స్థానం లభించింది. ఇక ఈ జాబితాలో అమెరికాను తలదన్ని చైనా నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది. మిలటరీ డైరెక్ట్ అనే రక్షణ రంగ వెబ్ సైట్ విడుదల చేసిన ‘అల్టిమేట్ మిలటరీ స్ట్రెంత్ ఇండెక్స్’లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ మేటి సైన్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది అమెరికానే. ఆ దేశం రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ ను చూసినా, ఆ దేశానికి ఉన్న ఆయుధ సంపత్తిని చూసినా అందరికీ అదే అనిపిస్తుంది. కానీ, అగ్రరాజ్యం అమెరికాను తోసిరాజని ప్రపంచ మేటి సైన్యాల జాబితాలో చైనా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 

జాబితాలో చైనా 100 కు 82 పాయింట్లతో అగ్రస్థానాన్ని సాధించింది74 పాయింట్లతో అమెరికా రెండో ర్యాంకు, 69 పాయింట్లతో రష్యా మూడో స్థానం, 61 పాయింట్లతో భారత్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. 43 పాయింట్లు సాధించిన బ్రిటన్ 9వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement