Tuesday, March 26, 2024

టీకా తీసుకుంటే టమోటాలు ఫ్రీ!

దేశంలో కరోనా కేసులు రోజుకు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. కానీ, ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం తగ్గడం లేదు. సామాజిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించకుండా తిరగటం లాంటివి చేస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. కరోనా టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు వేర్వేరు సంఘాలు, సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీకాలపై అవగాహన కలిగిస్తూనే కొన్ని చోట్ల టీకా తీసుకున్న వారికి కొన్ని రకాల గిఫ్ట్ లు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టీకా తీసుకునే వారికి ఉచితంగా టమోటాలు అందించాలని నిర్ణయించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి టమోటాలను సేకరించి టీకా తీసుకున్నవారికి పంచుతున్నారు.

ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని, రైతుల నంఉచి టమెటాలు సేకరించి వాటిని టీకా వేసుకున్న వారికి పంచుతున్నామని బీజీపూర్ మున్సిపాటి అధికారులు తెలిపారు.  కాగా, ఛత్తీస్ గఢ్ లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 13,834 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధికంగా 175 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement