Friday, March 29, 2024

ఉక్రెయిన్ కు భారీ దెబ్బ… చెర్నోబిల్ పవర్ ప్లాంట్ స్వాధీనం చేసుకున్న రష్యా

ఉక్రెయిన్ పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ఎయిర్ పోర్టులు, పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ పవర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంది. పవర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం సలహాదారుడు మైఖోలో ఫోడోల్యాక్ వెల్లడించారు. రష్యా దాడుల్లో చెర్నోబిల్ పవర్ ప్లాంట్ సురక్షితంగా ఉంటుందని మాత్రం తాము చెప్పలేమని చెప్పారు. రెండో ప్రపంచం యుద్దం తరువాత యూరోపియన్ దేశాల్లోని ఒక దేశం అయిన ఉక్రెయిన్ మీద జరుగుతున్న పెద్ద యుద్దం ఇదే కావడం గమనార్హం. చెర్నోబిల్ పవర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా ఆదేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement