Thursday, April 25, 2024

Cheating: చిప్ తో దొబ్బేస్తున్నారు.. బంకుల్లో బడా మోసం!

Wanaparthy: జిల్లాలో పెట్రోల్ బంకులలో రోజురోజుకు పెట్రోల్ దోపిడీ పెరిగిపోతోంది. బంకుల వ్యాపారులు వినియోగదారులను వినియోగదారులను నిండా ముంచుతున్నారు. అధికారులు సీజ్ చేసినా చాకచక్యంగా వ్యవహరించి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు కల్తీ పెట్రోలు ద్వారా అక్రమ మార్గంలో వ్యాపారులు దోచుకుంటూనే కొత్త దందాకు పాల్పడుతున్నారు వనపర్తి జిల్లాలో 51 పెట్రోల్ బంకులు ఉండగా ప్రతిరోజు 40 వేలకు పైగా లీటర్ల పెట్రోలు అమ్ముడవుతోంది. 30 వేల పైగా డీజిల్ అమ్ముతున్నారు.

చిప్ తో మోసాలు…
సాధారణంగా పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపు మిషన్ లో పెట్రోలియం శాఖ వారు నెంబర్లు మార్చకుండా సీల్ వేసి సీజ్ చేస్తారు. పెట్రోల్ బంకు యజమానులు సాంకేతికంగా వ్యవహరించి అధికారులు చేసిన సీజ్ చేసిన దాన్ని తొలగించి చిప్ ను అమర్చి లీటరు పెట్రోలులో 10 మిల్లీ మీటర్ల తక్కువ వచ్చేలా చేసి వినియోగదారులకు మోసాలకు పాల్పడుతున్నారు. యోగదారులు లీటర్ పెట్రోల్ కు సరి అయిన డబ్బులు చెల్లించిన పెట్రోలు తక్కువ రావడం ఏమిటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళితే కానీ ఫలానా బంకులు మోసాలు జరుగుతున్నాయని చెబితేనే అక్కడికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. కంపెనీ సీజ్ ను తొలగించి చిప్ అమర్చి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసి ఆ బంకులను అధికారులు సీజ్ చేసి వెళ్లిపోతున్నారు. కానీ కేసులు నమోదు చేసి ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండి కేవలం రూ. 60 వేల నుండి 70 వేల వరకు రుసుము ప్రభుత్వానికి చెల్లించుకుని వదలి పెడుతున్నారు.

- Advertisement -


జిల్లాలో మండలాల వారిగా చూసుకుంటే జిల్లా కేంద్రంలోని ఒక పెట్రోల్ బంకులో కంపెనీ సీజన్ తొలగించి చెప్పు అమర్చి మోసాలకు పాల్పడుతున్న అని తెలిసి తనిఖీలు నిర్వహించి ఒక పెట్రోల్ బంకులు సీజ్ చేయడం జరిగింది అలాగే పెబ్బేరు మండలంలో లో 10 బంకులు ఉండగా మోసాల పాల్పడుతున్నారని ఒక బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ఆత్మకూరులో నాలుగు బంకులు ఉండగా ఒక బంకు నడవడం లేదు 5 బంకులు, రేవల్లి లో మూడు బంకులు ఉన్నాయి. మదనాపురం లో ఒకే బంకు ఉండగా అది కొనసాగుతుంది. చిన్నంబావి పెద్దమందడి లో పెట్రోల్ బంకులు రెండు రెండు చొప్పున ఉన్నాయి. ఇక పానగల్, కొత్తకోట అమరచింత లో నాగేష్ చొప్పున పెట్రోల్ బంకులు కొనసాగుతున్నాయి.

శిక్షలు ఏవి…
బంకులు మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను నష్టాలకు గురి చేస్తుంటే అధికారులు తూతూమంత్రంగా కేసు నమోదు చేసుకొని వదిలేస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . వారిపై కేసులు నమోదు చేసి డీలర్ షిప్ రద్దు చేసే చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు ఇకనైనా అధికారులు పెట్రోల్ బంకుల పై దాడులు నిర్వహించి మోసాలకు పాల్పడ కుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement