Thursday, December 7, 2023

నేడు ఖ‌మ్మం జిల్లాలో టీడీపీ బ‌హిరంగ స‌భ‌.. పాల్గొన‌నున్న చంద్ర‌బాబు

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లాలో టీడీపీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈస‌భ‌కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్ పాల్గొన‌నున్నారు. వీరి ప‌ర్య‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. ముందుగా ఉ.9.30 గం.కు రసూల్‌పుర ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, అక్క‌డి నుంచి ఈశ్వరీబాయి విగ్రహం కూడలి నుంచి హబ్సిగూడ, ఉప్పల్‌ చౌరస్తా, ఎల్‌బినగర్‌, హయత్‌నగర్‌ బస్‌డిపో, పెద్దఅంబర్‌పేట, రామోజీఫిలిం సిటీ, కొత్తగూడ, చౌటుప్పల్‌ మీదుగా మ.12.30 గం.కు టేకుమెట్ల బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు.

- Advertisement -
   

మ. 2.15 గం.కు నాయకంగూడెం మీదుగా కూసుమంచి చేరుకుంటారు. మ.2.30 గం.లకు కేశవాపురం వద్ద ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మ.3 గం.లకు ఖమ్మం చేరుకుంటారు. 3.15గం.లకు మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియంకు సా. 4. 30 గం.లకు చేరుకొని, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం రాత్రి 7. 30గం.లకు స్టేడియం నుంచి బయల్దేరి వెంకటయ్య పాలెం మీదుగా చింతకానికి రాత్రి 8గం.లకు చేరుకుంటారు. రాత్రి 8. 30గం.లకు పాతర్లపాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement