Tuesday, April 23, 2024

నారాయణ అరెస్టు కక్షపూరితం.. వైఫల్యానికి కప్పి పుచ్చుకునేందుకే..

పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తమ వైఫల్యానికి కప్పి పుచ్చుకునేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. నారాయణ అరెస్టు పూర్తిగా కక్షపూరితం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణలో విఫలం అయిన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందని అన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు. అసలు పేపర్ లీక్ అనేదే  లేదంటూ మంత్రి బొత్స ప్రకటన చెయ్యలేదా అన్నారు. మాస్ కాపీయింగ్ కు, పరీక్ష ల నిర్వహణలో వైఫల్యాలకు… నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. అరెస్టుకు సరైన ఆధారాలు కూడా చూపించలేక పోయారని చంద్రబాబు అన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా…విచారణ చెయ్యకుండా నేరుగా అరెస్టు చెయ్యడం కక్ష పూరిత చర్య కాదా అని ప్రశ్నించారు. నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో జగన్ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. లీకేజే పేరుతో నారాయణను అరెస్టు చెయ్యడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement