Wednesday, April 24, 2024

World Record: చండీగఢ్​ యూనివర్సిటీ స్డూడెంట్స్​ ప్రయత్నం అద్భుతం.. అతిపెద్ద జెండా ప్రదర్శన!

ఆగస్టు 15న భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యావత్​ దేశ ప్రజలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో తమదైన రీతిలో వేడుకలు జరుపుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంటే, మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా, చండీగఢ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, NID ఫౌండేషన్‌కి చెందిన వలంటీర్లు కలిసి మానవ నిర్మితంగా జెండా రూపంలో నిలబడి అతిపెద్ద ఫ్లాగ్​ని ఆవిష్కరించారు. దీంతో ఇది రికార్డును సాధించింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రధాని పిలుపుతో చాలామంది డిఫరెంట్​ యాక్టివిటీస్​ చేస్తున్నారు. హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని పురస్కరించుకుని చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులు ఎన్‌ఐడి ఫౌండేషన్‌తో కలిసి రెపరెపలాడే జెండా మాదిరిగా మారి ప్రపంచ రికార్డు సృష్టించారు. చండీగఢ్ సెక్టార్ 16లోని క్రికెట్ స్టేడియంలో ఈ ఘనత సాధించారు. కాగా, ఈ పొటోలను కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తన ట్విట్టర్​లో షేర్​ చేశారు. “భారతదేశానికి గర్వకారణం. చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో గౌరవ గవర్నర్ ష్ బన్వరీలాల్ పురోహిత్ జీ సమక్షంలో జెండా ఊపడం ద్వారా భారతదేశం గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించినందుకు సంతోషిస్తున్నాము” అని లేఖి ఆ పోస్టులో పేర్కొన్నారు.

“#HarGharTiranga ప్రచారానికి రెక్కలొచ్చిన ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు @Chandigarh_uni విద్యార్థులు చేసిన గొప్ప సమిష్టి కృషి. #HarGharTiranga పట్ల దేశవ్యాప్త యువకుల ఉత్సాహం ప్రశంసనీయం,” అని ఓ పొలిటీషియన్​ మరో ట్వీట్​లో తెలిపారు.  చండీగఢ్ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రధాన ఈవెంట్‌కు ముందు సన్నాహాల ఫోటోలను కూడా షేర్​ చేసింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement