Thursday, March 28, 2024

Breaking: కరోనా వ్యాక్సిన్​ అప్​డేట్​.. రెండో టీకా, బూస్టర్​ డోస్​ మధ్య ఇక 6 నెలలే!

కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియలో కేంద్రం ఇవ్వాల మరో నిర్ణయాన్ని తీసుకుంది. ఇంతకుముందు లెక్క వ్యాక్సిన్​కు వ్యాక్సిన్​ మధ్య గ్యాప్​ 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. దీనిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) ఈ రిక్వెస్ట్​ చేసింది. COVID-19 టీకా రెండో డోస్ మరియు బూస్టర్​ డోస్​ మధ్య అంతరాన్ని తొమ్మిది నుండి ఆరు నెలలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. అంతకుముందు రెండో డోస్​ మరియు బూస్టర్​ డోస్​ మధ్య వ్యవధి తొమ్మిది నెలలుగా ఉండేది. ఇది ఇప్పుడు ఆరు నెలలు లేదా 26 వారాలకు తగ్గించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

అందుకని 18-59 సంవత్సరాల మధ్య లబ్ధిదారులందరికీ బూస్టర్​ డోస్​ని ప్రైవేట్ టీకా కేంద్రంలో రెండో  డోస్ ఇచ్చిన తేదీ నుండి ఆరు నెలలు లేదా 26 వారాలు తర్వాత ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

60 ఏళ్లు పైబడిన లబ్ధిదారులతో పాటు హెల్త్ కేర్ వర్కర్లు (హెచ్‌సిడబ్ల్యులు) మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యులు) ఆరు నెలల తర్వాత ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఉచితంగా బూస్టర్​ డోస్​ వేసుకోవచ్చు. దీనికి ముందు ప్రభుత్వం మే నెలలో విదేశాలకు వెళ్లే పౌరులు ఆయా దేశాల మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత తొమ్మిది నెలల నిరీక్షణ వ్యవధి కంటే ముందే టీకా పొందేలా ప్రభుత్వం అనుమతిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement