Tuesday, April 23, 2024

పూర్తి లాక్ డౌన్ ఉండదు:నిర్మలా సీతారామన్..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు లక్షన్నర పైగ కేసులు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కరోనాను కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం లాక్ డౌన్ పెడుతుందని అందరూ ఊహించుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్  విధించబోదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణా చర్యల్ని చేపడతామని ఆమె  వెల్లడించారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను  సంక్షోభంలోకి నెట్టడం తమకిష్టంలేదని ఆమె  పేర్కొన్నారు.  ఆయా కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన చర్యలపై మాత్రమే ఆధారపడుతుందని  అన్నారు. ఆయా రాష్ట్రాల  కోవిడ్‌ సమాచారాన్ని సేకరించామని, చర్యలు బావున్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ పెట్టే ఉద్యేశ్యమే లేదని తేల్చిచెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..పరిశ్రమలతో పాటు ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావాలపై మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్‌లో కూడా, తామె  పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌  దిశగా  పోవడంలేదన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, కరోనా నిబంధనలు లాంటి  ఐదు స్థంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామన్నారు. అలాగే వైరస్‌ బారిన పడిన వారి హోం క్వారంటైన్ చేస్తామన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే భారతదేశానికి ఆర్థిక లభ్యతను, రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు  ప్రపంచ బ్యాంక్ చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement