Saturday, April 10, 2021

వ్యాక్సిన్ కొరత లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

దేశంలో కరోనా టీకాల కొరత లేదని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన మొత్తంలో టీకా సరఫరా జరగుతుందని మంత్రి స్పష్టం చేశారు.ఇప్పటివరకూ ప్రజలకు 8.4 కోట్ల టీకా డోసులు వేశామని కూడా మంత్రి పేర్కొన్నారు. మంగళవారం ఒక్కరోజే 562807 టీకాలు వేశామని ఆయన తెలిపారు. ఇక స్థానిక ఎన్నికలు, రైతు నిరసనలు, పెళ్లి వేడుకల కారణంగా పలు చోట్ల కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు మంత్రి హర్షవర్ధన్.

Advertisement

తాజా వార్తలు

Prabha News