Friday, December 6, 2024

కొత్త‌గా 134మందికి క‌రోనా.. ఇద్ద‌రు మృతి

కొత్త‌గా 134మందికి క‌రోనా పాజిటీవ్ గా తేలింది..ఇద్ద‌రు మృతి చెందారు. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.11 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement