Monday, April 15, 2024

Shoking News: కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్..

భారత్‌లో ట్విట్టర్ ఖాతాలు తరచూ హ్యాకింగ్‌కు గురవుతుండ‌డం ఆందోళన క‌లిగిస్తోంది. బుధవారం ఉదయం కేంద్ర సమాచార, ప్రాసార శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా కొద్ది నిమిషాల పాటు హ్యాక్ అయ్యింది. అయితే వెంటనే ఖాతాను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. హ్యాకర్లు కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన త‌ర్వాత‌ వరుసుగా 50కిపైగా ట్వీట్లు చేశారు. హర్రీ అప్ (Hurry Up), అమేజింగ్ (Amazing) అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎల‌న్ మస్క్ ఫొటోతో హైపర్ లింక్‌ పెట్టారు.

ఈ ట్వీట్లు గందరగోళానికి గురి చేశాయి. వెంటనే అధికారులు ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం డిసెంబర్ 12న కూడా ప్రదాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక‌వ్వ‌డం గమనార్హం. హ్యాకర్లు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు పెట్టారు. లోపాలను సవరించి కాసేపటికే ప్రధాని ఖాతాను అధికారులు పునరుద్ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement