Friday, March 29, 2024

దేశ ద్రోహం చట్టంపై పున:పరిశీలన, సుప్రీంకు తెలిపిన కేంద్రం

దేశ ద్రోహ చట్టాన్ని పున:పరిశీలించేందుకు, పున:సమీక్షించేందుకు నిర్ణయంతీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది. ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా వలసపాలకుల కాలం నాటి చట్టాల కొనసాగించరాదన్న ప్రధాని నరేంద్రమోదీ అభిమతానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ ద్రోహ చట్టంపై దేశంలో వివిధ వర్గాల ప్రజలు, పౌర హక్కుల సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందనీ, దేశ సర్వసత్తాక ప్రతిపత్తి, దేశ సమగ్రతలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణమైన చట్టాలను మాత్రమే అమలుజేయాలనీ, భారత శిక్షాస్మృతిలోని 124-ఏ సెక్షన్‌ కింద దేశద్రోహాన్నిమోపే సెశ్రన్‌ను తొలగించాలని నిర్ణయించింది.

కేంద్రం ఈ చట్టాన్ని పున:పరిశీలించేవరకూ, సమీక్షించేవరకూ ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ఎటువంటి తీర్పు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. ఈ చట్టాన్ని కొనసాగింపుపై 1962నాటి సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించాలని ప్రభుత్వం ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే, ప్రధానమంత్రి అభిమతానికి అనుగుణంగా ఇప్పుడుఈ నిర్ణయాన్నితీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు పూర్తిగా సహకరిస్తామని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement