Tuesday, March 26, 2024

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి నిరాశే – ఆదిపురుష్ నుండి రాని అప్ డేట్

ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆదిపురుష్. ఈ కథలో రాముడి వైభవం..వైభవాన్ని ఎంతో గొప్పగా చూపించబోతున్నాం. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి.రామాయణం ఎప్పుడు బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాముడి పరాక్రమ శైలిని సినిమాలో హైలైట్ చేస్తున్నామన్నారు. అయితే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ ఉంటాయని అభిమానులు నిన్నటి రాత్రి నుంచి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజున కచ్చితంగా సినిమా నుంచి సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందని..ముఖ్యంగా టీజర్ ట్రీట్ ఉంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఆశలన్నింటిపైనా నీళ్లు చల్లేసారు.

అయితే ఆ ట్రీట్ కి బధులుగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని పోస్ట్ చేసారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ అభిమానులు షేర్ చేసిన ఫ్యాన్ మేడ్ ప్రభాస్ శ్రీరాముడి గెటప్ పోస్టర్లలను అన్నింటిని ఒకటి చేసి వీడియో రూపంలో నవమి సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ఫ్యాన్ మేడ్ ప్రజెంటింగ్ పేరుతో వీటిని ట్విటర్లో అద్భుతమైన బీజీఎమ్ ఇచ్చి షేర్ చేసారు. నిజంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. వచ్చే ఏడాది జనవరి 12న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఇందులో మరోసారి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement