Thursday, September 21, 2023

‘మెడికల్’ కళాశాల మంజూరుతో ఖమ్మంలో సంబరాలు

ఖమ్మం : జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఎన్నో ఏళ్ల మెడికల్ కళాశాల ఏర్పాటు కల సాకారం కావడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ప్రకటించడంతో ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో టిఆర్ఎస్ శ్రేణులు, వైద్య సిబ్బంది, వైద్యులు జిల్లా పరిషత్ చైర్మన్, ఆస్పత్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ లింగాల కమల్ రాజు సారథ్యంలో ఘనంగా సంబరాలు చేశారు. సీఎం కేసీఆర్ , మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. టపాసులు పేల్చి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకోల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా టిఆర్ఎస్ నాయకులు ఆర్ జె సి కృష్ణ , మంత్రి పువ్వాడ పిఏ రవి కిరణ్, ఆసుపత్రి అర్ ఎం బొల్లికొండ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తోపాటు టిఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆసుపత్రి టీఎన్జీవో నేతలు ఆర్వీఎస్ సాగర్, నందగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement