Sunday, March 24, 2024

CBSE టెన్త్ పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. CBSE పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయగా.. CBSE 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. CBSE బోర్డు అధికారులతో ప్రధాని మోదీ సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండటం, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో చివరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.

షెడ్యూల్ ప్రకారం మే 4 నుంచి జూన్ 14 వరకు జరగాల్సిన CBSE పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని, ఇంటర్నల్ మార్కుల ద్వారా ఫలితాలు ప్రకటిస్తామని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పిన ఆయన.. జూన్ 1న పరిస్థితులను సమీక్షించి CBSE 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement