Friday, April 19, 2024

పిల్లికి హెయిర్ కటింగ్.. ఈ వీడియోకి 20లక్షలకు పైగా వ్యూస్

ఓ హెయిర్ డ్రెస్సర్ తెల్లగా ముద్దుగా ఉన్న పిల్లి తలకి కటింగ్ చేశాడు..అంతేకాదండోయ్..పిల్లి మీసాలు కూడా కత్తిరించాడు. ఆ పిల్లి కూడా సాధారణ కస్టమర్ మాదిరిగానే ఓపిగ్గా కూర్చుంది. దువ్వెన పెట్టి కటింగ్ చేస్తుండగా.. హాయిగా కునుకు కూడా తీసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 20 లక్షలకు వైగా వ్యూస్ లభించాయి. పిల్లి చాలా బాగుందని, హెయిర్ కట్ తర్వాత అది మరింత క్యూట్ గా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను తాను పదే పదే చూస్తున్నానని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement