Thursday, April 25, 2024

మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్ లో కేసు నమోదు

మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదయింది. కరీంనగర్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కరీంనగర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి హిందూ దేవతలను అవమానించారన్న అభియోగాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్‌లో కేసు నమోదైంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో హిందూ దేవతలను కించపరిచేలా విద్యార్థులతో ప్రవీణ్ ప్రతిజ్ఞ చేయించారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కాగా, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రవీణ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. గురుకుల బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆ తర్వాత ఒక్కరోజులోనే ఆయనపై పాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలన్న ఆదేశాలు వచ్చాయి. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించింది.

ఇది కూడా చదవండి : గ్రామ సచివాలయ వ్యవస్థలో మార్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement