Tuesday, January 25, 2022

Breaking: హైద‌రాబాద్‌లో కారు బీభ‌త్సం.. ఎల్‌బీన‌గ‌ర్ వ‌ద్ద డివైడ‌ర్ ఢీకొట్టి బోల్తా..

హైద‌రాబాద్‌లో కారు బీభ‌త్సం సృష్టించింది. ఎల్‌బీన‌గ‌ర్‌లోని అండ‌ర్‌పాస్ వ‌ద్ద డివైడ‌ర్‌ను ఢీకొట్టి ప‌ల్టీలు కొడుతూ వెళ్లి బోల్తా కొట్టింది. ఆదివారం జరిగిన ఈ యాక్సిడెంట్‌తో కారు (TS11EK 8212)లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. వారిని స‌మీపంలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఈ కారు హై స్పీడ్ గా న‌డ‌ప‌డ‌మే యాక్సిడెంట్‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌తంలో కూడా ఇదే కారుపై హైస్పీడ్‌లో నడిపినందుకు 13,350 రూపాయ‌ల చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నట్టు స‌మాచారం. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News