Friday, April 19, 2024

Big Breaking: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ ల పాత డ్రాప్ట్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మాణించింది. మాస్టర్ ప్లాన్ ల పై గత కొన్ని రోజులుగా రైతులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలతో డ్రాప్ట్ రద్దు చేస్తూ పాలక వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ.. తీర్మానం చేసిననట్లు మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు. దీంతో రైతులకు చెందిన ఇంచు భూమి కూడా పోదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement