పోలీసులు ఇచ్చిన టీలో విషం ఉందేమో అన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. కాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్ ను నేడు అరెస్ట్ చేశారు. దాంతో ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్నోలో పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు… అఖిలేశ్ యాదవ్ కు టీ ఇవ్వడానికి వెళ్లారు. అయితే పోలీసులు ఇచ్చిన టీ తాగేందుకు అఖిలేశ్ యాదవ్ అంగీకరించలేదు. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా విషం కలిపి ఉంటే.. అంటూ సందేహం వ్యక్తం చేశారు. నేను ఈ టీ తాగను… మిమ్మల్ని ఎలా నమ్మగలను అంటూ అఖిలేశ్ ఆ టీ నిరాకరించారు.
- Advertisement -