Thursday, April 25, 2024

అత‌నికి 93.. ఆమెకి 63

ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా 93వ ఏట మ‌రోసారి పెళ్లిచేసుకున్నాడు బ‌జ్ ఆల్ డ్రిన్. చంద్రుడిపై కాలుపెట్టిన రెండో వ్యక్తిగా రికార్డులకెక్కారు బజ్ ఆల్ డ్రిన్ .అపోలో 11 అంతరిక్ష యాత్రలో భాగంగా 1969లో బజ్ ఆల్ డ్రిన్ చంద్రుడిపైకి వెళ్లారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన 19 నిమిషాల తర్వాత బజ్ అడుగుపెట్టారు. అపోలో 11 మిషన్ లో ముగ్గురు వ్యోమగాములు పాలుపంచుకోగా.. ఇప్పుడు బజ్ మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉన్నారు. చిరకాల ప్రేయసి డాక్టర్ అంకా ఫౌర్ ను బజ్ పెళ్లాడారు. పుట్టిన రోజు నాడే ఈ వివాహ తంతు జరుపుకోవడం విశేషం. ప్రస్తుతం బజ్ వయసు 93 ఏళ్లు కాగా.. అంకా ఫౌర్ వయసు 63.. తాజాగా బజ్ తన వివాహం తాలూకు చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని, టీనేజ్ ప్రేమికుల తరహాలోనే కిక్ ఇస్తోందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement