Monday, March 20, 2023

Breaking: శ్రీలంకతో వన్డే సిరీస్ బుమ్రా దూరం..

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. అన్ని ఫార్మాట్లలోనూ అతడు తనదైన ముద్ర వేయగలిగే బౌలర్‌. అలాంటి బౌలర్‌ సేవలను కొన్నాళ్లుగా టీమ్‌ కోల్పోయింది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్‌ తర్వాత బుమ్రా ఇండియన్‌ టీమ్‌కు ఆడలేదు. టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అతడు దూరం కావడంతో ఆ ప్రభావం టీమిండియా అవకాశాలను ప్రభావితం చేసింది.

- Advertisement -
   

అయితే మొత్తానికి అతడు తిరిగి వచ్చాడు. శ్రీలంకతో జనవరి 10 నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం బుమ్రా వస్తున్నాడు.. అనుకున్న క్రమంలో ఆయనకు అయిన గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కు దూరం కానున్నట్లు సమాచారం. తనకు అయిన గాయం కారణంగా బుమ్రా శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్ లో ఆడడం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement