Thursday, March 30, 2023

ఆప‌రేష‌న్ కెటిఆర్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కారు స్పీడ్‌ పెంచుతోంది. వరుస కార్యక్రమాలతో జనంలోనే ఉండేందుకు ప్రయత్ని స్తోంది. సమన్వయ కర్తలతో ముందుకు వెళ్లేలా ప్లాన్‌ చేసింది. పార్టీ ప్రణాళికలను సమన్వయ కర్తలతో అమలు చేయిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి రాగాలను అదుపు చేయా లని ఆదేశాలను జారీ చేశారు. టికెట్‌ వచ్చినా రాకున్నా నేతలు పార్టీ లైన్‌ దాటకుండా ముందు నుంచే కాపాడుకునే ప్రయ త్నాన్ని ముమ్మరం చేశారు. బహిరంగంగా ఎవరూ పార్టీపై విమర్శలు చేయకుండా సమన్వయ కర్తలే చూడాలని అధిష్టానం బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ గెలిస్తే భవిష్యత్తు ఉంటుందని అసమ్మతి నేతలకు సూచిస్తున్నారు. అధిష్టానం నుంచి హామీలను ఇప్పించే ప్రయత్నాలను మొదలు పెట్టారు. అంతేకాకుండా వారికి ఏదో ఒక పదవి రూపంలో లబ్ధి చేకూరుతుందన్న గ్యారంటీని సమన్వయ కర్తల ద్వారా నమ్మకాన్ని కల్పిస్తున్నా రు. కొన్ని ప్రాంతాల్లో సమన్వయ కర్తల మాటలను కూడా లెక్క చేయని లీడర్ల జాబితాను ఎప్పటికప్పుడు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పంపిస్తున్నారు. వారిపై వచ్చే పార్టీ మీటింగ్‌లో కానీ లేదా సమయం చూసి చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గ్రౌండ్‌ రిపోర్ట్‌ పై ఆరా
బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టు లను తెప్పించుకొని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో గమనిస్తున్నా రు. ప్రజల వద్దకు పార్టీ కార్యక్రమాలు చేరుతున్నా యా లేదా అన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. పార్టీ ప్రణాళికలను అమలు చేయని వారిపై కూడా ఓ కన్నేసి ఉంచినట్లు సమాచా రం. పార్టీకి కానీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు కానీ వ్యతిరేకత ఉన్న నియోజక వర్గాల్లో ఎక్కువగా ఫోకస్‌ పెట్టాలని సమన్వయ కర్తలకు సూచించినట్లుగా పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా నేతలతో పాటు పార్టీ నేతలందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలి. వారి వారి సెగ్మెంట్లలో ఏదో ఒక కార్యక్రమాలకు తప్పకుండా హాజరుకావాల్సిందే. కానీ అసంతృప్తితో ఉన్న నేతలు కొంత మంది పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారు. వారి జాబితాను కూడా కేటీఆర్‌ తెప్పించుకుంటున్నారు. దారి తప్పుతున్న నేతలను గాడిలో పెట్టే పనులు మొదలు పెట్టారు.

- Advertisement -
   

ఆపరేషన్‌ గులాబీ
ప్రతిపక్షాలు గెలిచే స్థానాలపై గులాబీ పార్టీ నజర్‌ పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలే కాకుండా స్థానికంగా ఎక్కువ పట్టు ఎవరికైతే ఉంటుందో వారినే ముందుంచుతోంది. కొంత మంది లీడర్లకు గ్రౌండ్‌ను ప్రిపేర్‌ చేసుకోవాలని సూచించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో మరో నేతను కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయానికి ప్రజాబలం ఎక్కువగా ఎవరికి ఉంటే వారికే టికెట్‌ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు బిఆర్‌ఎస్‌ నేతలు తెలుపుతున్నారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని ఏ పని చేయకున్నా.. ప్రజా అభిప్రాయానికే తమ ప్రియారిటీ అన్న సంకేతాలను ఇప్పటికే ఇచ్చారు. కానీ కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి పట్నంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. హైదరాబాద్‌ను ప్రతి ఎమ్మెల్యే వీడి.. వారి సొంత నియోజక వర్గాల్లోనే ఉండాలని కేటీఆర్‌ సూచించారు. అయినా కేటీఆర్‌ మాటలను పెడ చెవిన పెడుతున్న ఎమ్మెల్యేలు బిజినెస్‌ పనులు, కాంట్రాక్టులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.
ఇప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో ప్రజలకు బిఆర్‌ఎస్‌ పార్టీ అంటే అభిమానం ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే, వారి అనుచరుల తీరు నచ్చక నొచ్చుకుంటున్నారు. వారంతా గులాబీకి పట్టుకొమ్మల్లా ఉంటూ వస్తున్నారు. అందరిని కలుపుకుపోయే ప్రయత్నం ఎమ్మెల్యేలు చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేయాల్సింది పోయి ఎమ్మెల్యేలు రుబాబు చూపిస్తున్నారంటూ పలు చోట్ల జనం నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేటీఆర్‌ పార్టీ సమావేశాల్లోనే కాకుండా అదును చూసి వారిపై చర్యలు తీసుకోనున్నట్లుగా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement