Thursday, April 18, 2024

మ‌రో తెలుగు మూవీలో బ్రిటీష్ న‌టి ‘ఒలీవియా మోరిస్’

మ‌రో తెలుగు ప్రాజెక్ట్ కు బ్రిటీష్ తార ఒలీవియా మోరిస్ ఒకే చెప్పింద‌ని స‌మాచారం. జాతి ర‌త్నాలు ద‌ర్శ‌కుడు అనుదీప్ త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ తో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అయింది. ఈ చిత్రంలో న‌వీన్ పోలిశెట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నార‌ట‌. ఒక హీరోయిన్ గా ఒలీవియాను ఎంచుకున్నార‌ట‌. ఈ చిత్రం విదేశాల్లో షూట్ చేయ‌నున్నారు. కాగా ఈ బ్రిటీష్ న‌టితో అక్క‌డే ఈ సినిమా షూట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న బ్రిటీష్ తార ఒలీవియా మోరిస్. అక్కడ టెలివిజన్ సిరీస్ లు చేసిన పేరు తెచ్చుకున్న ఒలీవియా ఆర్ఆర్ఆర్ లో ఒక నాయికగా నటించింది. ఎన్టీఆర్ కు ఈ భామ జోడీగా కనిపించనుంది. నాటు నాటు పాట లిరికల్ సాంగ్ లో ఒలీవియాను చూపించారు. ఎన్టీఆర్ చరణ్ మాస్ స్టెప్పులు చూసి ఒలీవియా ఎంజాయ్ చేయడం ఆ పాట వీడియోలో ఉంది. ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement