Friday, April 19, 2024

విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు.. కూలిన బ్రిడ్జి

జాతీయ ర‌హ‌దారి154ఏ మార్గంలోని వంతెన‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ సంఘటనలో ఆ బ్రిడ్జీ పూర్తిగా కూలిపోయింది.
దీంతో ఆ జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. దీంతో చంబా-భర్మూర్ జాతీయ రహదారిపై ఇరువైపులా పలు వాహనాలు నిలిచిపోయాయి.ఈ విషయం తెలిసిన వెంటనే చంబా జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కొండచరియలు విరిగిపడటంతో 20 మీటర్ల పొడవైన బ్రిడ్జీ కూలిందని చంబా డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక కారు, లారీ కూడా లోయలో పడినట్లు చెప్పారు. వంతెన కూలడంతో జాతీయ రహదారి కనెక్టవిటీ పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement