Saturday, November 27, 2021

Breaking : వివేకా మ‌ర్డ‌ర్ కేసు..సైడ్ ట్రాక్ కోస‌మే విమ‌ర్శ‌లు..మార‌క‌పోతే మెడ‌లు వంచుతాం..బాల‌కృష్ణ..

మీడియా ముందుకొచ్చింది నంద‌మూరి కుటుంబం. నిన్న టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న‌పై నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న మాట్లాడుతూ..జ‌రుగుతున్న అరాచ‌కాల‌కు జ‌న‌మే స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. నోటితో కాదు ఓటుతో జ‌నం జ‌వాబు చెప్పాల‌న్నారు. వ్య‌క్తి గ‌త దూష‌ణ‌లు స‌రికావ‌ని అన్నారు. జ‌రిగిన ప‌రిణామాలు దుర‌దృష్ట‌క‌ర‌మైన‌వ‌ని అన్నారు. వ్య‌క్తిగ‌త అజెండాగా పెట్టుకుని వైసీపీ నేత‌ల మాట‌ల దాడి స‌రికాద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు,ప‌లు అంశాల‌మీద పోరాటం చేయాల‌ని దివంగ‌త నేత ఎన్టీఆర్ చెప్పార‌ని గుర్తు చేశారు. గొడ్ల చావిడిలో ఉన్నామా..అసెంబ్లీలో ఉన్నామా అని మండిప‌డ్డారు.

ఇదే నా హెచ్చ‌రిక‌..మ‌ళ్లీ ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తే భ‌ర‌తం ప‌డ‌తాం..ఖ‌బ‌డ్దార్ అని హెచ్చ‌రించారు బాల‌కృష్ణ‌. మైండ్ గేమ్ ప్లే చేస్తారా అని మండిప‌డ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం జ‌ర‌గాల్సిన స‌మావేశాలు,వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు వాడుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌తీ దానికి ఒక హ‌ద్దు ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఇక ఉపేక్షించేది ప్ర‌సక్తే లేద‌న్నారు. ప‌ర్స‌న‌ల్ ఎజెండాతో మా కుటుంబ‌స‌భ్యుల‌ను కించ‌ప‌రిచార‌ని అన్నారు. అధికారం వ‌చ్చింది క‌దా అని ..విర్ర‌వీగి మాట్లాడితే స‌హించ‌బోమ‌ని మండిప‌డ్డారు. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫైట్ చేయాల‌ని హిత‌వు ప‌లికారు. నోరు అదుపులో పెట్టుకోవాల‌ని సూచించారు..మేం చేతులు క‌ట్టుకుని కూర్చోలేద‌న్నారు. మా ఆడ‌వాళ్ల జోలికి వ‌స్తే ఊరుకునేది లేద‌న్నారు. వివేకా హ‌త్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు..స్పీక‌ర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. మీరు మార‌కుంటే మెడ‌లు వంచి మారుస్తామ‌న్నారు..పార్టీ ఆఫీస్ పై కూడా దాడి చేశార‌న్నారు. భువ‌నేశ్వ‌రిపై వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం అని తెలిపారు. అధికారం శాశ్వ‌తం కాద‌న్నారు బాల‌కృష్ణ‌. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడితే స‌హించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News