Friday, February 3, 2023

Breaking : రెండు రైళ్లు ఢీ.. 155మందికి గాయాలు

రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 155మంది ప్ర‌యాణికుల‌కి గాయాలు అయ్యాయి. ఈ ప్ర‌మాదం స్పెయిన్ ఈశాన్య కాట‌లోనియా ప్రాంతంలో జ‌రిగింది. బార్సిలోనా రైల్వే స్టేష‌న్ సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఒక రైలు స్టేష‌న్‌లో పార్క్ చేసి ఉండగా.. ఆ రూట్ లోనే ఎదురుగావ‌స్తున్న‌ మ‌రో రైలు దాన్ని ఢీకొట్టిన‌ట్లు తెలుస్తోంది. సిటీ సెంట‌ర్‌కు ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మాంట్‌కాడా స్టేష‌న్ వ‌ద్ద ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement