Friday, April 26, 2024

Breaking : నాగోల్ లో విషాదం – స్విమ్మింగ్ పూల్ లో ప‌డి బాలుడు మృతి

హైద‌రాబాద్ సిటీ నాగోల్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లూఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ లో మునిగి బాలుడు మృతి చెందాడు. చిన్నారుల‌కు స్విమ్మింగ్ ట్యూబ్స్ ఇవ్వ‌లేదు పూల్ సిబ్బంది. స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్ల‌క్ష్య‌మేన‌ని బంధువులు ఆరోపించారు. ఈ బాలుడికి 10సంవ‌త్స‌రాలు. కాగా బాలుడు స్విమ్మింగ్ చేస్తుండ‌గా ట్రైన‌ర్ కూడా ద‌గ్గ‌ర‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బాలుడు మ‌నోజ్ స్విమ్మింగ్ పూల్ లో ప‌డిపోయిన 10నిమిషాల వ‌ర‌కు ప‌త్తా లేకుండా పోయారు సిబ్బంది. స్విమ్మింగ్ పూల్ లో సేప్టీ ప్రికాష‌న్స్ తీసుకోలేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement