Thursday, April 25, 2024

Breaking : త‌మిళ బిగ్ బాస్ హోస్ట్ గా శృతిహాస‌న్..ఎందుకో తెలుసా..!

బిగ్ బాస్ కి హోస్ట్ గా రానుంద‌ట హీరోయిన్ .విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కుమారై శృతిహాస‌న్..అయితే తెలుగు షోకి కాదులెండి..త‌మిళ బిగ్ బాస్ కి.. ఇటీవల అమెరికా టూర్‌ వెళ్లొచ్చిన న‌టుడు కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు వారాల పాటు కమల్ హాస‌న్ బిగ్‌బాస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగానే కమల్‌ స్థానంలో ఆయ‌న కూతురు శృతీ హాసన్‌ను తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నార‌ట‌. శృతీ హాసన్‌ అయితే బాగుంటుందని భావిస్తోన్న షో నిర్వాహకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్‌. మరి కమల్‌ స్థానాన్ని ఎవరు రీప్లేస్‌ చేస్తారో చూడాలి.తెలుగులో నాగార్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటే సమంత హోస్ట్‌గా వ్యవహరించి విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement