Wednesday, November 30, 2022

Breaking : స్పిన్ టెక్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం ..మంట‌లార్పుతున్న సిబ్బంది ..

బాపులపాడు మండలం రేమల్లి మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది.. నిల్వ ఉంచిన కాటన్ బెల్ గోదాము యూనిట్ -2లో భారీగా మంట‌లు ఎగిసి పడుతున్నాయి. దాంతో ఐదు ఫైరింజన్లు ద్వారా మంటల అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. వీరవల్లీ ఎస్ ఐ సుబ్రహ్మణ్యం.. పోలీసులు సిబ్బంది కలిసి ఏటువంటి ప్రాణనష్టం జరగకుండా సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదం గల కారణాలు తెలియరాలేదని వెల్ల‌డించారు.. మంటలు అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని..మిగ‌తా వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని వీరవల్లీ ఎస్ ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. న‌ష్టం ఎంత జ‌రిగిందో ఇంకా తెలియ‌రాలేద‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement