Friday, April 19, 2024

Breaking : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి క‌న్నుమూత..

న్యూమోనియాతో బాధపడుతూ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఇక లేరు. అనారోగ్యంతో కొద్ది సేపటి క్రితం ఆయన చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ నెల 24న న్యూమోనియో చికిత్స కోసం ఆయ‌న కిమ్స్ లో చేరారు. కాగా, ఈరోజు (మంగ‌ళ‌వారం) సాయంత్రం 4 గంట‌లకు ఆయ‌న తుది శ్వాస విడిచారు.

ఇక తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోస్తారు సిరివెన్నెల.. “విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం” అంటూ మొదలన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతోంది. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కె విశ్వనాథ్ కు పరిచయం చేసారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే.. అలాగే రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట .. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల. లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

1986లో సిరివెన్నెల చిత్రంతో గేయ రచయితగా పరిచయమయ్యారు. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సిరివెన్నెల చిత్రానికి గాను ఆయన ఉత్తమ లిరిసిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. శృతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో సినీ లోకం మూగ‌బోయింది..

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు ఎమై పోని
మారదు లోకం మారదు కాలం

- Advertisement -

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
ఎ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు ఎమై పోని
మారదు లోకం మారదు కాలం.. అనే సిరివెన్నెల పాట ఎంతో ప్రాచుర్యం పొందింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement